వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం…
1 min read
17వ వర్ధంతి సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులు
హోళగుందలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
హోళగుంద న్యూస్ నేడు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని హోళగుంద మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హోళగుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం. అమానుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రజలకు అందించిన సేవలను, ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్సార్
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజా నాయకుడని ఎం. అమానుల్లా అన్నారు. ఆయన ఆశయాలను, ప్రజా సంక్షేమ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత, సేవా భావం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.


