NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల భద్రతపై అవగాహన…

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని కస్తూరిబాయి జూనియర్ కళాశాలలో మహిళల భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేకత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు పలు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.వ్యక్తిగత భద్రత, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలను వివరించారు. అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *