సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ నిరసన
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: మాకున్న సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం తహసిల్దార్ టి శ్రీనివాసులు,డిప్యూటీ తహసిల్దార్ శాన్వాజ్,ఆర్ఐ జహంగీర్ మరియు సిబ్బంది కార్యచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసన తెలుపుతున్నామని తహసిల్దార్ అన్నారు. అధికారులకు పెండింగ్ లో ఉన్న డిఏ,ఐఆర్ విడుదల చేయాలి.పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారుల డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారుల స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాధిక, వీఆర్వోలు సుందరరాజు, ఖాదర్ బాష,ఖాజా హుస్సేన్,వీఆర్ఏ వెంకటేశ్వర్లు,సివో అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


