NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి

1 min read

కౌతాళం,న్యూస్ నేడు : మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి  17వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద్ ఆచారి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. రైతుల కోసం ఆయన ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నాయకత్వంలో అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, కౌతాళం మాజీ సర్పంచులు అవతారం,పాల్ దినకర్, ఉప సర్పంచ్ సక్రి తిక్కయ్య, లింగారెడ్డి, నరసిరెడ్డి, వడ్డే రాము, సుగురప్ప, సమ్మద్, భీమేష్, తాహెర్ వలి, వడ్డే చిన్న ఉసేని, రామకృష్ణ, మహేంద్ర, మహమ్మద్, సక్రి శ్రీరామ్, నాగరాజు, బెస్త మర్రిస్వామి, వడ్డే ఆంజి, జీడీ ఖదీర్, వడ్డే గురు, అబ్బసలి, ఎన్టీఆర్ నగర్ భాషా, సుధాకర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఖాదర్ లింగ, వార్డు మెంబర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *