ట్విట్టర్ కు బండ్ల గణేష్ గుడ్ బై !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. తరచూ ట్విట్టర్ లో వివాదాస్పదమైన, ఆసక్తికర ట్వీట్ లు చేసే ఆయన.. ఇక నుంచి ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్ ట్వీట్లకు స్వస్త చెబుతానంటున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. అయితే.. బండ్ల గణేష్ ట్విట్టర్ కు ఎందుకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడో ఇంకా స్పష్టంగా చెప్పలేదు. వివాదాలు వద్దని, జీవితంలో వివాదాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.