రిజర్వేషన్స్,రాజ్యాంగం అను అంశంపై చర్చవేదిక
1 min read
రిజర్వేషన్స్ ద్వారనే ఎస్ సి,ఎస్ టి వర్గాలు మేలు పొందారు
అడ్వకేట్ కలపాల రవి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రిజర్వేషన్స్, రాజ్యాంగము అను అంశంపై ఉదయం బిషప్ డా:కారుపాటి శాంతి సాగర్ గృహములో చర్చవేదిక నిర్వహించబడినది.రిజర్వేషన్స్ భారత దేశంలో స్వతంత్రము రాక ముందే ఇవ్వబడ్డాయని రిజర్వేషన్ ఫలితముగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లండన్ వెళ్లి చదువుకోగలిగారని, సాహుమహారాజ్ చేత ప్రతిపాదించబడిన రిజర్వేషన్స్ ద్వారా ఇప్పటికి ఎస్ సి,ఎస్ టి వర్గాలవారు మేలు పొందితున్నారని ముఖ్య వ్యాఖ్యత అడ్వకేట్ కలపాల రవి తెలిపారు. అంబేద్కర్ కృషి వల్ల రాజకియ్యాల్లో రిజర్వేషన్స్ వచ్చాయని ఎస్ స్సీ ఎస్టి వారు 130 మంది 24% పార్లమెంట్ లో నేడు ఉన్నారంటే రిజర్వేషన్స్ ఫలితమని అడ్వకేట్ మేరుగు దుర్గారావు తెలిపారు.ఈ డిబేట్ లో రెవ తేళ్ళ శాంబాబు,రెవ రమేష్ ,విశ్రాంత ఎంఆర్ ఓ బెన్ని, సొంగ మధు,ఎన్ అనీల్, బుధ కృపావరంపాల్గొన్నారు.రిజర్వేషన్స్ పైన మరింత విస్తృత చర్చ మేధావులతో విజయవాడ లో ఏర్పాటు చేయనున్నామని కలపాల రవి తెలిపారు.


