NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డిప్యూటీ సీఎం బర్త్ డే వేడుకలు

1 min read

రక్తదానం చేసిన జనసేన ప్రభాకర్..

నందికొట్కూరు న్యూస్ నేడు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు బుధవారం కర్నూలు, నందికొట్కూరులో ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు.తర్వాత కొత్త బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 36 మంది జనసైనికులు రక్తదానం చేశారు.అదేవిధంగా కర్నూలులో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.మెగాసిరి ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తలు 102 మంది రక్తదానం చేశారు. మిడుతూరు మండలం జనసేన పార్టీ యువకులు గుడిపాడు ప్రభాకర్ రక్తదానం చేశారు.జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అదే విధంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ప్రభాకర్ సొంతం చేసుకున్నారు. కర్నూలులోజిల్లా కోఆర్డినేటర్ ఐటి వింగ్ కో ఆర్డినేటర్ సాధనగిరి లక్ష్మీకాంత్ రెడ్డి,రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ వెల్ఫేర్ తోళ్ల మంజునాధ్,కొత్తపల్లె రాజశేఖర్,వీరం నవీన్ రెడ్డి, హర్ష రాయల్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎంతో అవసరమని వారు కొనియాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *