NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

1 min read

శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

మదనపల్లె  ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం ప్రతినిధి ) : మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన ప్రధాన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.ఇందులో మదనపల్లె ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి,గౌరవ సలహాదారుగా సిరివేలు చరణ్ నాయుడు, అధ్యక్షులు గా నక్కింటి రవీంద్ర, కార్యదర్శిగా మోడెం శ్రీనివాసరావు, కోశాధికారిగా నానబాల కుమార్ లను ఎన్ను కున్నారు. ఇందుకు మదనపల్లె ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అప్పిన పల్లి భాస్కరాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మదనపల్లె ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం తనను గౌరవ అధ్యక్షులుగా ఎన్ను కోవడం సంతోషంగా ఉందన్నారు.పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైందని సమాజంలో జరిగే పరిణామాలను ప్రజలకు వివరిస్తూ నిస్వార్ధమైన సేవలందించడంలో ముందుంటారని కొనియాడారు.సమిష్టి కృషితో మదనపల్లె ప్రెస్ క్లబ్ అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపు నిచ్చారు.అనంతరం గౌరవ సలహా దారు సిరివేలు చరణ్ నాయుడు మాట్లాడుతూ మహోన్నత ఆశయం,సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటైన మదనపల్లె ప్రెస్ క్లబ్ గౌరవ సలహా దారులుగా తనను నియమించడం ఆనందంగా ఉందన్నారు.మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సంక్షేమం అభ్యున్న తికి తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు.పాత్రికేయ వృత్తిలో తనకు అనుభవం తక్కువే అయిన  ఈ రంగంలో తనకు అందరూ సన్ని హితు లేనన్నారు. సమాజంలోని సమస్యలను,లోటుపాట్లను నిర్భయం గా ప్రచురించి ప్రజల పక్షాన కలం గళం వినిపించాలని ఆయన సూచించారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నూతన అధ్యక్ష, కార్యదర్శి,కోశాధికారులు మాట్లాడుతూ తమకు అప్ప గించిన బాధ్యతల ను సమర్థవంతగా నిర్వర్తిస్తామని,మదనపల్లె ప్రెస్ క్లబ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని,పాత్రికేయుల సమస్యల పై పోరాటం చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం లో మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ముందు వరుసలో నిలుపు తామని వెల్ల డించారు. తమకు ఈ అవకాశం కల్పించిన మదనపల్లె ప్రెస్ క్లబ్ సభ్యులకు కృత జ్ఞతలు తెలిపారు. అనంతరం సభ్యులు నూతన ప్రధాన కమిటీని దుశ్యాలువలతో ఘనంగా సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *