ఏపీ అభివృద్ధిలో డీసీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అద్వితీయం
1 min read
తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ ప్రశంస
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఏపీ అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర అద్వితీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ పేర్కొన్నారు.బుధవారం నిమ్మనపల్లి కూడలిలోని టిడిపి కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపు కున్నారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి జనసేన అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆర్.జె.వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుండి విముక్తి కల్పించి కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ తనదైనా పాత్ర పోషించా రన్నారు.ఉప ముఖ్యమంత్రిగా,పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సమర్థ వంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజిఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కిలోమీటర్లు పైగా సీసీ రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కు తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తారురోడ్లు వేసి గిరిజనుల బాధలను తొలగించి, వారి జీవితాలలో వెలుగులు నింపారని కొని యాడారు.గతంలో ఉమ్మడి ఏపీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు జబ్బులు బారిన పడితే,వారి పక్షాన పోరాడి మంచినీటిని అందించారన్నారు.నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే పవన్ కళ్యాణ్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంక రించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్ల మెంట్ అధికార ప్రతినిధి విజయమ్మ,మాజీ సర్పంచ్ రాజన్న, చలపతి,రామన్న జనసేన నాయ కులు గట్టు రాజన్న,బసినకొండ రామచంద్ర,వెంకటరమణ,నాసిర్,కనకమ్మ,దేవకిలు పాల్గొన్నారు.


