NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ నగరంగా కర్నూలును తీర్చిదిద్దుతాం

1 min read

మంత్రి టీ.జీ. భరత్, యస్‌ఏసి చైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐఏఎస్

30 ఎలక్ట్రిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  బుధవారం కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, తడి–పొడి చెత్తను మూలంలోనే వేరు చేయించడం వంటి చర్యల ద్వారా కర్నూలును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ & నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి, ఐఏఎస్ అన్నారు. బుధవారం కొండారెడ్డి బురుజు వద్ద రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నగరపాలక సంస్థకు మంజూరు చేసిన 30 ఎలక్ట్రిక్ ఆటోలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐఏఎస్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి టీ.జీ. భరత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను విధించడంతో పాటు, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చెత్తపై పన్నును రద్దు చేశామని తెలిపారు. స్వచ్ఛ కర్నూలు కలను సాకారం చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున నగరపాలక సంస్థకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. తక్కువ సమయంలోనే నగరపాలక సంస్థ అధికారులు అనేక అభివృద్ధి, పారిశుద్ధ్య ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు.కార్యక్రమంలో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.పర్వీన్ బాణు, ఎస్ఈ రమణమూర్తి, ఎం‌హెచ్‌ఓ డాక్టర్ ఎం.రఘు, నగరపాలక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *