వృద్ద వయస్సులో తల్లిదండ్రులను పిల్లలు ప్రేమగా చూసుకోవాలి. డాక్టర్. శంకర్ శర్మ
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: ప్రస్తుత పరిస్థితుల్లో వృద్దాశ్రమ నిర్వహన భారంగా మారిందని డాక్టర్. శంకర్ శర్మ అన్నారు. కర్నూలు సమీపంలోని ప్రజా నగర్ ఎదురుగా ఉన్నకాధంబరి టౌన్ షిప్ లో సేద వృద్దాశ్రమానికి కెంట్ ఫ్యూరిటీ వాటర్ ఫిల్టర్ ను డాక్టర్. శంకర్ శర్మ అందించారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ వృద్దులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అమెరికాలో స్థిర పడిన మధుసుధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలుగా సేద వృద్దాశ్రమం నిర్వహించడం హర్షిందగ్గ విషయం అన్నారు. వృద్దాశ్రమంలో వృద్దులకు ఆరోగ్యం కోసం వాటల్ ఫిల్టర్ తన వంతు సహయంగా ఇచ్చానన్నారు. కలుషిత నీరు త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అందువల్ల ఫ్యూరిఫై వాటల్ ఫిల్టర్ ఇచ్చాన్నారు. ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం మరియు ఇతర దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడినందున నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని దీంతో వృద్దాశ్రమాల నిర్వహన కష్టంగా మారిందన్నారు. సేద వృద్దాశ్రమానికి తనవంతు సహయంగా ఎల్లప్పుడు ఉంటుందన్నారు. దాతలు ముందుకు వచ్చి వారికి తోచినంత సహయం వృద్దాశ్రమాలకు అందించాలని సూచించారు. తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు పంపడం సరికాదని చివరి దశలో వారిని ప్రేమగా చూసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో సేద వృద్దాశ్రమం నిర్వహాకులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.


