NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వందవాగిలిలో భూ సర్వే పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

1 min read

పంటల బీమా, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి – మల్లికార్జున వినతి

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఐ.ఏ.ఎస్. నేడు పరిశీలించారు. గ్రామంలో భూ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మండల మాజీ సొసైటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వందవాగిలి మల్లికార్జున జాయింట్ కలెక్టర్‌ను కలిసి గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితులు సరిగా లేకపోవడంతో పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొంటుందని, రైతులకు పంటల బీమా విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా మొట్ట భూములకు సంబంధించిన సమస్యలు, జేసీ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌ను మల్లికార్జున కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.రైతుల సమస్యలను జాయింట్ కలెక్టర్‌కు వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు మల్లికార్జున తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *