హలో మాదిగ.. చలో వరంగల్
1 min read
సెప్టెంబర్ 9న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి
మాదిగలంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి – సుభాష్ చంద్ర మాదిగ, పెద్ద సంజప్ప
హోళగుంద న్యూస్ నేడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ, హోళగుంద మండల ఇంచార్జ్ పెద్ద సంజప్ప పిలుపునిచ్చారు.గురువారం హోళగుంద మండలంలోని హెచ్‌ఎల్‌సీ అతిథి గృహం ఆవరణలో ఎంఎస్పీ మండల అధ్యక్షులు చిన్నహేట దేవప్ప అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం ప్రాధాన్యతను వివరించారు.మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ నిర్దేశించిన దుస్తుల నియమావళిని పాటిస్తూ సెప్టెంబర్ 8వ తేదీనే వరంగల్ చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది మనోజ్, ఎంఎస్పీ మాజీ జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ, హెబ్బటం పకీరప్ప మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు ఎన్. వెంకటేష్, గోవర్ధన్, సినిమా మంగన్న, హెబ్బటం రాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు భాస్కర్ మాదిగ, వందవాగిలి లక్ష్మీకాంత్, హెబ్బటం నారాయణ, భీమేష్ తదితర ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.


