ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో రెండు చోట్ల ఉట్టి కార్యక్రమాలను నిర్వహించారు.పట్టణంలోని కిందిగేరి బందేనా స్వామి ఆలయం వద్ద యాడికి పార్థసారథి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం వద్ద పోస్టల్ ఏజెంట్ శివయ్య దంపతులు, కందుల వ్యాపారి బైసాని సురేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడి వేషధారణలో పాల్గొని ఉట్టి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 50 మంది చిన్నారి కృష్ణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమితి కార్యదర్శి ఎం. రామాంజనేయులు శ్రీకృష్ణుడి జన్మ విశేషాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు పార్థసారథి, పాఠశాల కార్యదర్శి బీసీ విజయ్‌కుమార్, రంగనాథ్, కృష్ణారెడ్డి, ప్రధానాచార్యులు పార్వతి, ఆచార్య బృందం, గ్రామ ప్రజలు, బాలబాలికలు, పోషకులు తదితరులు పాల్గొన్నారు.



