NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్యాపిలిలో ఎస్టియుఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. వివిధ యాప్‌లలో డేటా ఎంట్రీలతో బోధనకు ఆటంకం కలుగుతోందని, సీనియర్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు టెట్ నిబంధనను తొలగించాలని కోరారు. 12వ పిఆర్సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడంతో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ వెంకట నాయక్, సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *