అత్యంత వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: హరి ఓం కర్నూలు నగరము నందు పవిత్ర తుంగభద్రా నది తీరాన వెలసిన శ్రీ గీతా ప్రచార ధామం లో ఈ నెల 4.9.26 శుక్రవారం రోజు కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమం అంతయు శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల శ్రీ నాగ మల్లేశ్వరమ్మ మరియు వారి కుమార్తె దేవి శ్రీ ఆధ్వర్యంలో ఉ.10.00 ఈ వేడుకలు ప్రారంభించబడినది మొదట గోమాతకు పూజ చేయబడినది అనంతరం చిన్న పిల్లలందరికీ శ్రీకృష్ణుని వేషాలు గోపికలు వేషాలతో చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది చిన్నపిల్లల చేత ఉట్టి కొట్టే కార్యక్రమం,ఆటలు పాటలు నృత్య ప్రదర్శనలు కనుల విందుగా జరిగాయి అనంతరం ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి D V రమణ కుమారులు కోడళ్ళు అందరు వచ్చి చిన్నారులందరికీ బిస్కెట్లు స్నాక్స్ మరియు చల్లని పానీయాలు ఏర్పాటు చేశారు అనంతరం కార్యక్రమానికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులకు కూడా తాడు లాగే పోటీలు ఏర్పాటు చేశారు అనంతరం వచ్చిన భక్తాదులందరికి అన్న ప్రసాదం ఏర్పాటు ఏర్పాటు చేశారని గీతా ప్రచార సంఘ అధ్యక్షులు శ్రీ D V రమణ నేతృత్వంలో కమిటీ సభ్యులు శ్రీ ఇల్లురు రమణ సింహాద్రి రమేష్ సంఘ ప్రచారక్ మహాబలేష్ సజ్జనార్ ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియపరచడమైనది.


