NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నరసింహారావుపేటలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

1 min read

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలందంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు

అసిస్టెంట్ మలేరియా అధికారి జె.గోవిందరావు సూచిన

నెలలో ప్రతి శుక్రవారం’ ఫ్రైడే ఫ్రైడే ‘తప్పనిసరిగా ఆచరించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:అపరిశుభ్ర పరిసరాలు అంటువ్యాధులుకు ఆవాసాలని పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రతని,సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించవచ్చని  ఏలూరు నరసింహారావు పేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్:యన్. రాజు మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జె. గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు తమ్మిలేరు ఏటిగట్టు లో ప్రజలకు “ఫ్రైడే డ్రై డే “పరిసరాల పరిశుభ్రత ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడడం వల్ల కీటకాలు అభివృద్ధి చెంది ముఖ్యంగా దోమలు ఈగలు ద్వారా ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ మలేరియా అతిసారా,కామెర్లు, టైఫాయిడ్ మొదలగు అనారక సమస్యలతో బాధపడే అవకాశం ఉందని ముఖ్యంగా దోమలు పెరగకుండా ఇంటి పరుషాలు పల్లప్రాంతాలు మట్టితో పూడ్చుకోవాలని సాధారణంగా మనం వాడే తొట్టెలు డ్రమ్ములు ఓవర్ ట్యాంకులు వారానికి ఒకసారి కడిగి మూతలు పెట్టుకోవాలని తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టుకోవచ్చని, మురికి కాలంలో చెత్త వేయరాదని  సూచించారు అలాగే ఈగల అభివృద్ధి ఇంటి పరిసరాల్లో చెత్త పోగులు,పేడ పోగులు పెట్టరాదని ప్రతి శుక్రవారం ఫ్రైడే  డ్రై డే ఆచరించాలని సూచించారు  ఈ కార్యక్రమంలో  హెల్త్ అసిస్టెంట్ మేక శ్రీనివాసరావు, నాగరాజు స్టాఫ్ నర్సస్ సైలజ, నాగారత్నం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *