ఏపీ జెఎసి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం
1 min read
ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎంతో నిబద్ధత తో కూడిన సంఘం
పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి.శ్రీనివాస్
సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో సమర శంఖారావం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రంగా నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయని ఏపీ జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి.శ్రీనివాస్ అన్నారు. ఏలూరు నగరంలో పంచాయతీరాజ్ సంఘ భవనంలో ఏపీ జెఎసి ఆధ్వర్యంలోఈ విలేకరుల సమావేశం సందర్భంగా చోడగిరి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎంతో నిబద్ధత తో కూడిన సంఘం అని అన్నారు. ఉద్యమాలతో కాకుండా ప్రభుత్వంతో చర్చల ద్వారా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో జరిగే సమర శంఖారావం సభలో ఉద్యోగుల భవిష్యత్తుపై ఐక్య కార్యాచరణ ప్రణాళిక చర్చలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తారీఖు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి జనరల్ సెక్రెటరీ రామారావు,ఏపీ ఎన్జీవోస్ జిల్లా జేఏసీ సెక్రటరీ నెరుసు రామారావు, మాజీ సంఘ సభ్యులు హరినాథ్, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


