శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు కర్నూలుకు తరలిన యాదవులు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు:శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ప్యాపిలి మండలానికి చెందిన యాదవ సోదరులు శుక్రవారం కర్నూలుకు తరలివెళ్లారు. కర్నూలులోని శ్రీకృష్ణ ఆలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపు మేరకు నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు వారు బయలుదేరారు.కర్నూలుకు తరలిన వారిలో రామ్మోహన్ యాదవ్, విలేఖరి గోల్ల దశరథ యాదవ్, కోదండ యాదవ్, రమేశ్, మద్దిలేటి, శ్రీనివాసులు, శ్రీరాములు, సురేష్, ప్రహ్లాద తదితరులు ఉన్నారు.


