NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హంద్రీనీవా కాల్వలోకి దూసుకెళ్లిన కారు

1 min read

కారును బయటకు తీసిన పోలీసులు..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు- గార్గేయపురం మధ్యనున్న హంద్రీనీవా కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కర్నూలు మండలం దిన్నె దేవరపాడు గ్రామానికి చెందిన చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చందాపురం రామచంద్రారెడ్డి (62) అనే వ్యక్తి కాలువ వెంట ఉన్న పొలాలను కొనేందుకు కాల్వ వెంట వస్తుండగా మారుతి సుజుకి  (ఏపీ 28 ఏటి 1974)గల కారును రామచంద్రారెడ్డి గల్లంతు అయ్యారు. రామచంద్రా రెడ్డి కారును నడుపుతుండగా కారు అదుపు తప్పి కాల్వలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 13 వేలకు పైగా కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉంది.

ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ

ఘటనా స్థలాన్ని కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, తాలూకా సీఐ తేజోమూర్తి, ఎస్సై మరియు సిబ్బంది పరిశీలించారు.అగ్నిమాపక సిబ్బంది,ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు  గాలింపు చేపట్టగా హైడ్రా క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *