NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాబోయే ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్ఆర్‌సీపీ జెండా రెపరెపలాడాలి

1 min read

కార్యకర్తలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం

కార్యకర్తల సంక్షేమంకోసం ఎల్లవేళలా తోడుగా ఉంటా

జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి

అన్నమయ్య , (న్యూస్ నేడు ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తల సమిష్టి సహకారంతో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను పూర్తి చేసుకున్నామని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా పీలేరులో నిర్వహించిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా  స్థాయి విస్తృత సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు పార్టీపై ఉన్న హక్కుకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.త్వరలోనే గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఐడీ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలాంటిదని, కష్టకాలంలో కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే అన్ని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి స్థానంలో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేయలేదని, నిరుద్యోగ భృతి అమలు చేయలేదని ఆరోపించారు.50 ఏళ్లకే పెన్షన్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 తదితర హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మొదటి ఏడాది రైతు భరోసాను కూడా ఎగరగొట్టారని అన్నారు.   కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఎక్కువ ప్రాజెక్టులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనే పునాది పడిందని, ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ లు చింతల రామచంద్రా రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు,హిందూపురం పరిశీలకులు  రమేష్ కుమార్ రెడ్డి,మదనపల్లె ఇంచార్జి నిస్సార్ అహమ్మద్ తదితర జిల్లా వ్యాప్తంగా నాయకులు ,రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ నాయకులతో పాటు రాయచోటి నియోజక వర్గానికి చెందిన మండల వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, స్టేట్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి గొర్ల ఉపేంద్రా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పి టిసి మాసన వెంకట రమణ, మండల కన్వీనర్లు నవాజ్ (రాయచోటి), ఉదయ్ కుమార్ రెడ్డి (సంబేపల్లె)  ,  గోవర్ధన్ రెడ్డి (చిన్నమండెం) ,మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ( లక్కిరెడ్డిపల్లె), పోలు సుబ్బారెడ్డి ( రాయచోటి), జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, గడికోట జనార్దన రెడ్డి (రామాపురం),  యదుభూషన్ రెడ్డి (గాలివీడు) , మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గుండా సురేంద్ర,  బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్,  మాజీ ఎంపీపి, మాజీ జెడ్ పి టిసి, మాజీ  కౌన్సిలర్లు, సర్పంచ్ లు,ఎంపిటిసిలు  తదితరులు  పెద్దఎత్తున  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *