NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అశోకా స్పోర్ట్స్  అరేనా ప్రారంభం

1 min read

కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు :  విద్యార్థినిలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం, జట్టు స్ఫూర్తి మరియు ప్రతి రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభను సాధించే లక్ష్యంతో కర్నూలులోని అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా అశోకా స్పోర్ట్స్  అరేనాను సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు మాంటిస్సోరి పాఠశాలల కరస్పాండెంట్ డా. గయాని రాజశేఖర్ మరియు కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా. డి. నిఖేతన్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అశోక్ వర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ విద్యార్థినిల భవిష్యత్తుకు కేవలం విద్యా ప్రతిభ మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించేలా కళాశాలలో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు.డా. గయాని రాజశేఖర్  మాట్లాడుతూ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.డా. డి. నిఖేతన్ రెడ్డి  మాట్లాడుతూ  ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని అన్నారు. నేటి విద్యార్థినిలు ఎక్కువ సమయం చదువులు, సాంకేతిక పరికరాలకే కేటాయిస్తున్న నేపథ్యంలో శారీరక వ్యాయామం మరియు క్రీడలకు సమయం కేటాయించడం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలు ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని చెప్పారు.కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అరేనా విద్యార్థినిలకు వివిధ క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మంచి వేదికగా నిలవనుంది. దీని ద్వారా విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవడంతో పాటు వివిధ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహం లభించనుంది.క్రీడలు విద్యార్థుల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని, ఒక జట్టుగా కలిసి పనిచేయడం ద్వారా సహకారం, నాయకత్వం మరియు బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం అభివృద్ధి చెందుతుందని అతిథులు తెలిపారు.విద్యతో పాటు క్రీడలు, శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం మరియు వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని యాజమాన్యం తెలిపింది.అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో  అశోకా స్పోర్ట్స్ అరేనా ప్రారంభం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరో ముందడుగుగా నిలిచింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *