విద్యార్థులు భవిషత్తును బంగారు బాటలుగా తీర్చిదిద్దుతున్న గురువులు దైవంతో సమానం
1 min read
సమాజ ప్రగతికి బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు సేవలు చిరస్మరణీయం, అభినందనీయం
భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు
ఉపాధ్యాయులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా పరిషత్తు సమావేశం మందిరంలో శనివారం భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)లు పూలదండలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రార్థన గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 33 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు, శాలువాలు, పండ్లను ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును బంగారుబాటలుగా తీర్చిదిద్దుతున్న గురువులు దైవంతో సమానం అని, గురుపూజా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం అని, ఆదర్శ గురువులు భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయులు అన్నారు. ఆదర్శ ఉపాధ్యాయులుగా, ఉపరాష్ట్రపతిగా అనంతరం రాష్ట్రపతిగా పనిచేసి విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయులు ఈ రోజు పుట్టినరోజుని మనందరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులు జ్ఞానాన్ని అందించి సంఘంలో ఒక గౌరవనీయ వ్యక్తిగా తీర్చిదిద్దడంలో గురువులు పాత్ర అపారమైనదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పించడం చాలా అవసరమని అన్నారు.ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య( చంటి) మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత మనల్ని సరైన మార్గంలో నడిపించేది గురువు ఒక్కరేనని అన్నారు. ఆ గురువుకి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలని అన్నారు. గురువు అంటే దైవంతో సమానం అని, విద్యార్థికి సరైన నడకని బాటని వేసి మంచి సంస్కృతి సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే గురువు పాత్ర చాలా అమోఘమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, పరీక్షలు నిర్వహణ సహాయ కమీషనరు ఆర్.ఆశ, ఉప విద్యాశాఖ అధికారులు డా.పి. యస్.సుధాకర్, యన్.రవీంద్ర భారతి, జిల్లా పరిషత్తు, విద్యాశాఖ అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


