NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రాంతినగర్ లో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు: నంద్యాల పట్టణం, క్రాంతినగర్ లో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నందు గత ఐదురోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం అత్యంత భక్తిశ్రద్దలతో ముగిశాయి. ప్రముఖ వ్యాఖ్యాత ఉపన్యాసకులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులుచే శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవతాలపై ధార్మిక ప్రవచనాలు, ప్రతిరోజు బాలనాగిరెడ్డి బృందంచే భజనలు, ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక అర్చకులు వై. సి.సంగీత్ కుమార్ భక్తులందరితో సామూహిక కుంకుమార్చనలు, గోమాతకు పూజలు చేయించారు. ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నవారికి తి.తి.దే. సహకరిస్తుందని తి.తి.దే. హిందూ ధర్మప్రచారపరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.వెంకటేశ్వర రెడ్డి, మిట్టా వెంకటేశ్వరరెడ్డి, శివారెడ్డి, అంగడి సుబ్బారెడ్డి, జి. చెన్నారెడ్డి, జి. చెన్నారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మి, స్వప్న, కృష్ణకుమారి, పక్కీరమ్మా, ప్రమీల, రమాదేవి, కుమారి, తులశమ్మతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *