12వ రోజుకు చేరిన శాంతియుత దీక్ష
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుత దీక్ష కొనసాగిస్తామని సింగిల్ విండో అధ్యక్షుడు సీమా సుధాకర్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ సుదర్శన్, టీడీపీ నాయకులు బోయినచెరువుపల్లి కృష్ణయ్య, రజినీ యాదవ్ తెలిపారు.శనివారం ప్యాపిలి మండలంలోని శ్రీపురం గ్రామంలోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 12వ రోజు శాంతియుత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



