అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
1 min read
వివిధ సేవల రూపేణా రూ.1,94,250/- లు సమకూరినది
కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన
సుమారు 1850 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నదానం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శనివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము , గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.08.00లకు ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మద్యాహ్నం గం.03.00 ని లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.1,94,250/- లు సమకూరినది. ఈ రోజు మద్యాహ్నం గం.3-00 వరకు విచ్చేసిన సుమారు 1850 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నదానము జరుపబడినది. శ్రీ స్వామి వారి దేవస్థానం గర్భాలయం నందు గల తెల్ల మద్ది చెట్టును సంరక్షించుట నిమిత్తం ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి వారు వెంకటరామన్నగూడెం నందు గల వైస్సార్ ఉద్యానవన విశ్వవిధ్యాలయం అసోసియేట్ డీన్ వారిని కలిసి నివేధిక సమర్పించడమైనది. శ్రీ స్వామి వారి దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మ కర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.


