స్థానిక ఎన్నికలపై గ్రామ సభ
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే గ్రామ సభలో తెలియజేయాలని స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓ నాగేశ్వరరావు సూచించారు.ప్యాపిలి పట్టణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల సమస్యలు, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలతో చర్చించారు.ప్యాపిలి పట్టణంలో మొత్తం 11,533 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో ఎస్సీలు 1,030, బీసీలు 8,271, ఎస్టీలు 286, ఇతరులు 1,946 మంది ఉన్నారని, పురుష ఓటర్లు 5,550, మహిళా ఓటర్లు 5,983 మంది ఉన్నారని వెల్లడించారు.కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



