నేలమల్లేశ్వరుడి సన్నిధిలో రెడ్డి మోహన్ ప్రమాణం
1 min read
తండ్రి ఆశయాల ను కొనసాగించాలి
తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : నిమ్మనపల్లి మండలం లోని తవళం గ్రామంలో వెలసిన శ్రీ నేల మల్లేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్స వం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్గా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ రామకృష్ణ కుమారుడు రెడ్డి మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకమండలి సభ్యులకు శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాలకమండలి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రెడ్డిమోహన్ తన తండ్రి రామకృష్ణ రాజకీయ, సామాజిక సేవా ఆశయాలను అందిపుచ్చుకుని ప్రజలకు, భక్తులకు అందుబాటులో ఉండాలని శ్రీరామ్ చినబాబు హితవు పలికారు. ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఏమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి, రాటకొండ మధుబాబు, యాలగిరి దొర స్వామి నాయుడు, అర్జె వెంకటేష్, చీకులభైలు మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఎంపిపి మల్లికార్జున, మండల పార్టీ ప్రెసిడెంట్ రాజన్న, సింగిల్ విండో ప్రెసిడెంట్ రమణ, మాజీ జడ్పీటీసీ రెడ్డప్ప రెడ్డి, కార్యకర్తలు, ఆలయ అధికా రులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



