NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“జాతీయ లోక్ అదాలత్ పై కర్నూలు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా  న్యాయ సేవా సదన్  నందు  శ్రీ పి. వాసు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫుల్ అడిషనల్ చార్జ్  చైర్మన్ మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కర్నూలు మరియు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి   కర్నూలు హెడ్ క్వార్టర్ లోని జ్యూడిషల్ అధికారుల తో కర్నూలు జిల్లా పోలీస్ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతో, ఇన్సూరెన్స్ న్యాయ వాదులతో సెప్టెంబర్ 12 న జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో కోర్టులలో ఉన్న రాజి కాదగిన క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను, మోటార్    యాక్సిడెంట్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులతో కేసులపై సమీక్ష  నిర్వహించి ఈ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా కృషి  చేయాలని కోరారు.ప్రతి రోజు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాలలో గల కోర్టుల  నందు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుచున్నాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షి దారులు తమ కేసులను ఈ ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ లలో రాజీపూర్వకంగా పరిష్కరించుకోగలరని కోరారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సంధ్య రాణి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, మొబైల్ మేజిస్ట్రేట్  అనూష, ఐదవ అదనపు మేజిస్ట్రేట్  స్రవంతి,  మేజిస్ట్రేట్ అపర్ణ, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, యస్ ఐ లు, పోలీసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *