NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి….

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఆచార్యులు కె. పార్వతి ప్రారంభించారు. సీనియర్ ఆచార్యులు వాసు అక్షరాస్యత దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిజోరం, కేరళ, గోవా రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించాయని తెలిపారు. దేశంలో పురుషుల్లో సుమారు 88 శాతం, మహిళల్లో దాదాపు 78 శాతం మంది అక్షరాస్యులుగా ఉన్నారని వివరించారు.ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బాలబాలికలు పాఠశాలలకు వెళ్లకుండా ఇంటి, వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని సూచించారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే దాదాపు పూర్తి అక్షరాస్యతను సాధించాయని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *