NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలదుర్గం గ్రామంలో అధికారుల తనిఖీలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి  తనిఖీ చేశారు. గ్రామ సిబ్బంది హాజరును పరిశీలించి, ఎన్టీఆర్ భరోసా దరఖాస్తులను త్వరితగతిన ఆన్‌లైన్ చేయాలని సిబ్బందికి సూచించారు.అనంతరం జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఆరోజు మెనూలో పల్లీ చట్నీకి బదులుగా పచ్చిమిర్చి, ఉప్పు, కారం, టమాటాలతో పచ్చడి తయారు చేయడంతో పాటు కారం అధికంగా ఉండటంపై వంట నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూకు విరుద్ధంగా భోజనం అందించడం పునరావృతమైతే రికార్డుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు అందించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక (మోటివేషన్) తరగతులు నిర్వహించి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *