NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయచోటిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్

1 min read

1.5 కిలోల గంజాయి స్వాధీనం

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి

అన్నమయ్య జిల్లా  (న్యూస్ నేడు ప్రతినిధి) : అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒడిశా నుంచి అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తున్న 1.5 కిలోల గంజాయిని పట్టుకున్నామని జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి రాయచోటిలో వివరాలు వెల్లడించారు.ఈ వ్యవహారంలో గంజాయి విక్రయిస్తున్న సయ్యద్ హుజైఫా, కత్తి వినయ్ కుమార్, సయ్యద్ మహమ్మద్ రఫీ అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాయచోటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను కాపాడేందుకు మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పి ఎంఆర్ కృష్ణమోహన్ అర్బన్ సిఐ బివి చలపతి స్థానిక ఎస్సై అబ్దుల్ జహీర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *