NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్స్‌కు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా కర్నూల్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. చైతన్య కుమార్, జనరల్ సర్జన్ డా. భార్గవ్ వ్యాస్ ను ఆయన ఆత్మీయంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డా. చైతన్య కుమార్ , డా. భార్గవ్ వ్యాస్ , హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి  కలిసి బుర్రా వెంకటేశం ని ను ఘనంగా సత్కరించి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయనతో ఆత్మీయంగా ముచ్చటించారు.కర్నూల్‌లో మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలు, ముఖ్యంగా అధునాతన కార్డియాక్ వైద్య సేవలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి వైద్య బృందం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని డా. చైతన్య కుమార్  & డా. భార్గవ్ వ్యాస్  తెలిపారు. ఆయన రాకతో ఆసుపత్రి సిబ్బందిలోనూ ఉత్సాహం నెలకొంది.హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ, “బుర్రా వెంకటేశం  వంటి ఉన్నతాధికారిని మెడికవర్ హాస్పిటల్స్‌లో ఆత్మీయంగా కలుసుకుని సత్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఆయన పర్యటన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *