అఖిలపక్షం చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి ప్రజల స్వచ్ఛంద మద్దతు
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS)లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని వెంటనే తరలించాలని, నూనెపల్లె మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సమస్యలపై అవగాహన పెంచుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను తెలియజేశారు.సెప్టెంబర్ 2న ప్రారంభమైన ఈ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 8న నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పప్పుల బజారు, రెడ్డి చావడి, సిమెంట్ రోడ్డు మీదుగా మెయిన్ బజార్ వరకు ప్రచారం నిర్వహించారు.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కో-కన్వీనర్లు ఎజాస్, జానయ్య, చిన్న రామకృష్ణ రెడ్డి, అడ్వకేట్ శంకరయ్య, యర్రం శంకర్ రెడ్డి, విద్యార్థి నాయకుడు రాంబాబు, చౌడప్ప, చింతలయ్య, అడ్వకేట్ నాగేశ్వరరెడ్డి, పట్నం రాముడు, రామ్మోహన్ రెడ్డి, మోహన్ బాబు, షణ్ముఖరావు, మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


