గుడివాకలంక గ్రామంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం, న్యాయవిజ్ఞాన సదస్సు
1 min read
ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో నిరక్షరాస్యత కనిపిస్తుంది
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో నిరక్షరాస్యత కనిపిస్తుందని, దీని రూపుమాపాల్సిన బాధ్యత అధికారులతో పాటు మనఅందరిపై ఉందన్నారు. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాల నందు చేర్పించాలే కాని బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించరాదని తెలియజేశారు. చదువుకొని తల్లిదండ్రులు వయోజన విద్యను ప్రోత్సహించడం వల్ల పిల్లలకు మార్గదర్శకం కావాలని, బాలలకు మంచి చదువుని నేర్పించడం ద్వారా మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు. కావున చదువు విషయంలో పిల్లలను ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తించాలని సూచించారు, పల్లెలలో నేటికీ కొన్నిచోట్ల బాల్యవివాహాలు సాంప్రదాయం కొనసాగుతుందని, ఇది బాలల అభివృద్ధికి ఆటంకంగా మారిందని సూచించారు. బాల్య వివాహాలను ఎదురైన సంబంధిత అధికారులు దృష్టికి, లేదా జిల్లా న్యాయ సేవాదికార సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. బాల్యవివాహాలను అరికట్టడంలో పౌరులు తమ వంతు కృషిచెయ్యాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు పిరత్నరాజు, ఏ.గంగాభవాని, డిసిపివో డా.సి.హెచ్.సూర్యచక్రవేణి, సిడిపివో పద్మావతి, ఎమ్మార్వో విజయరాజు, క్రాఫ్ జిల్లా కో-ఆర్డినేటరు ఎస్.వినోద్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



