NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెన్షన్ నమోదు గడువు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగించాలి

1 min read

– సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. రహిమాన్

ప్యాపిలి న్యూస్ నేడు: సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ చివరి వరకు పొడిగించాలని సీఐటీయూ ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. రహిమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెన్షన్ కోసం రెండేళ్లకు పైగా ఎదురుచూస్తున్న పేదలకు ప్రస్తుతం ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఇబ్బందికరంగా మారిందన్నారు. వివిధ ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉండగా, తక్కువ వ్యవధిలో వాటిని పొందడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించడం పేదలకు కష్టంగా ఉందన్నారు.సెలవులు కారణంగా దరఖాస్తుకు అందుబాటులో ఉన్న రోజులు మరింత తగ్గిపోయాయని పేర్కొన్నారు. అవసరమైన నిబంధనలను మాత్రమే అమలు చేసి, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. గడువును సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రహిమాన్ డిమాండ్ చేశారు.

About Author