వాల్మీకి ఆలోచన నాగరికతకు తొలిమెట్టు
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
చనుగొండ్లలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: భారతీయ నాగరికత అంటేనే రామాయణం, రామాయణం అంటేనే వాల్మీకి అని, వేల సంవత్సరాల క్రితం, అక్షరం ఇంకా గ్రంథంగా మారని కాలంలోనే, మానవ సమాజానికి ధర్మం అంటే ఏమిటో, రాజ్యం ఎలా ఉండాలో, మనిషి ఎలా బ్రతకాలో ఒక మహాకావ్యం ద్వారా బోధించిన తొలి దార్శనికుడు వాల్మీకి మహర్షి అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గూడూరు మండలం, చనుగొండ్ల గ్రామంలోని వాల్మీకి మహర్షి దేవస్థానం నందు వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా శ్రీమద్రామాయణ ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ధార్మిక ప్రవచకులు డమాం జగదీశ్ మాట్లాడుతూ సమాజానికి నాగరికతను అందించిన భారతదేశం ఎప్పటికి విశ్వగురువేనని ఉద్ఘాటించారు. తదనంతరం స్థానిక భజన మండలి చేసిన భజన కార్యక్రమం ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమం నారాయణ, కోటేశ్వరయ్య, నాగేశ్వరయ్య, చిన్న మాదన్న, సురేశ్, చిన్న గోకారమయ్య, సూర్య నారాయణ, నడిపి బడేషా, గోవిందు, సమాదయ్య, కృష్ణమూర్తి, వెంకటరాముడు, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు.


