సిపిఎం అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే
1 min read
దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం విస్తృత ప్రచారం
న్యూస్ నేడు , పత్తికొండ: జేడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల దేనని , మండల సమగ్రాభివృద్ధి కొరకు పోరాడుతూ ప్రజానీకానికి రైతాంగానికి అండగా ఉన్న సిపిఎం పార్టీ జెడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు బి. రామాంజనేయులు మండల ప్రజానీకాన్ని కోరారు..జడ్పిటిసి ఎంపిటిసి సిపిఎం అభ్యర్థులకాంక్షిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ మండలంలో ప్రజా సమస్యల మీద గత ఐదు సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీలకు ప్రజలను ఓటు అడుగు అడిగే హక్కు ఉందని ఏమాత్రం అధికారం లేనప్పుడే ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలకు ఆయా స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారిని జడ్పిటిసిలుగా ఎంపీటీసీలుగా గెలిపించడం ద్వారా మరింతగా ప్రజల కోసం పని చేస్తారని దేవనకొండ జడ్పిటిసి అభ్యర్థి బోయపావని అదేవిధంగా దేవనకొండ రెండు,మూడు ఎంపీటీసీ స్థానంలో పోటీ చేస్తున్న చిప్పగిరి పాండురంగడు,ముక్కెళ్ల ప్రభావతిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రజలదేనని ఆయన పేర్కొన్నారు ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు బాసటగా వెన్నుదన్ను గా నిలవాల్సిన సమయం వచ్చిందని భవిష్యత్తులో మండల ప్రజానీకం తరఫున సాగు నీరు,మౌలిక సదుపాయాలపై పోరాడేందుకు ప్రజలు మరింతగా సిపిఎం పార్టీని ఆశీర్వదించాలని మండలంలో పోటీ చేస్తున్న జడ్పిటిసి ఎంపీటీసీల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


