పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి
1 min read
– సీపీఐ మండల కార్యదర్శి మహేష్
ప్యాపిలి న్యూస్ నేడు: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించి సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కూరగాయలు, పప్పులు, వంటనూనె, బియ్యం, పాలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.నిత్యావసర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించి, పేదలకు సబ్సిడీపై సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతే ప్రజలను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్, మనోహర్, రమేష్, రాము, హమాలీ సంఘం నాయకులు శ్రీనివాసులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


