NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డా. గురురాజుకు ఘన సన్మానం

1 min read

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గురురాజుకు ఘన సన్మానం

విజయవాడలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గ నాయకుల మర్యాదపూర్వక భేటీ

టీడీపీ బలోపేతానికి ప్రవాసాంధ్రుల సహకారం ఎంతో కీలకం: నాయకులు

హోళగుంద న్యూస్ నేడు: విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గురురాజును ఆలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గురురాజుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ప్రజా నాయకుడు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, జిల్లా నాయకుడు అబ్దుల్ సుభాన్తో పాటు హొళగుంద మండలానికి చెందిన టీడీపీ నాయకులు విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి డాక్టర్ గురురాజును కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజు బాధ్యతలు స్వీకరించడం పార్టీకి ఎంతో గర్వకారణమని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారిని తెలుగుదేశం పార్టీతో మరింతగా అనుసంధానం చేయడంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ప్రవాసాంధ్రులు తమ స్వగ్రామాలు, రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం అభినందనీయమని నాయకులు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోకి తీసుకెళ్లేందుకు ఎన్‌ఆర్‌ఐ విభాగం మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.డాక్టర్ గురురాజు నాయకత్వంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ మరింత బలోపేతమై, విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం విజయవాడలో పలువురు టీడీపీ నాయకులను కూడా ఆలూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకులు హనుమంతు, భాస్కర్, డ్రైవర్ మల్లి, ఎర్రిస్వామి, గోవింద్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతనంగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గురురాజుకు నాయకులు, కార్యకర్తలు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author