తెలుగుదేశం పార్టీ..రైతు ప్రభుత్వం
1 min read
యూరియా పంపిణీ చేసిన క్లస్టర్ ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి..
మిడుతూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ క్లస్టర్ ఇంచార్జి కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామంలో రైతు సేవా కేంద్రం దగ్గర బుధవారం కమతం రాజశేఖర్ రైతులకు యూరియాను పంపిణీ చేశారు.మాసపేట, ఉప్పలదడియ, కలమందలపాడు గ్రామాల రైతులకు యూరియాను అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు ప్రభుత్వం నుండి యూరియా వచ్చిందని ఇంకా రైతులకు అవసరమైతే యూరియాను తెప్పించి రైతులకు అందజేస్తామని రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఇప్పటి వరకు మూడు గ్రామాల రైతులకు కలిపి మొత్తం 280 మంది రైతులకు యూరియా మరియు డిఏపి పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా రాబోయే మరో 5 రోజుల్లో డిఏపి మళ్లీ స్టాక్ వస్తుందని స్టాక్ వచ్చిన వెంటనే అవసరమైన రైతులకు డిఏపి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కే మహేష్,కమతం వీరారెడ్డి, ఖాజామియా,సిద్ధిక్,చాకలి రామకృష్ణ,వీఆర్ఏ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.


