NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్’లో ప్రారంభమైన పోషణ మాసం

1 min read

అక్టోబర్ 9 వరకు మాసోత్సవాలు..

మిడుతూరు న్యూస్ నేడు: 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు-2026 నిన్న బుధవారం నుండి మిడుతూరు మండలంలో ప్రారంభించారు.ఈ మాసోత్సవాలు ఈ నెల 9 నుండి అక్టోబర్ 8 వరకు జరుగుతాయని అంగన్ వాడీ సూపర్వైజర్ రేణుకా దేవి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం ఈ మాసోత్సవ కార్యక్రమాలు సూపర్ వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల

స్థాయిలో పోషణ మాసోత్సవాలు

ప్రధానమంత్రి వారణాసి వై టెలీకాస్ట్ ద్వారా ప్రారంభించారు.పోషణ మాసోత్సవంలో 5రకాల తీమ్ లు నిర్వహించడం జరుగుతుంది.ఇందులో మనం అంగన్వాడి మన బాధ్యత,ఆహార

వైవిధ్యమ్,అంగన్వాడీలో తాజా వేడి భోజనం, సమాజ భాగస్వామ్యం, పోషణ బాల్య ప్రేరణ, ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ నెల అంతా కార్యక్రమాలు నిర్వహించి వైద్య,విద్య,అంగన్ వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందించే పౌష్టికాహారం వల్ల చిన్నారులకు కలిగే ఆరోగ్యకరమైన విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప,అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author