NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5 రోజుల పనిదినాలు అందరికీ సమానంగా అమలు చేయాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  యూఎఫ్​బియూ పిలుపు మేరకు 11 న కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కర్నూలు కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ర్యాలీ మరియు ధర్నా చేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది.5 రోజుల పనిదినాలు ముఖ్య డిమాండ్ గా మరియు పిఎల్​ఐ ను అందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ తో సమ్మె చేయడం జరిగింది. సరైన స్పందన రాకపోతే ఈ నెల 28, 29, 30 తేదీలలో మూడు రోజుల సమ్మెకు నోటీసు ఇవ్వడం జరిగింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని బ్యాంక్ యూనియన్స్ నాయకులు తెలిపారు. ఈ సమ్మెలో కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్  ఏపీ స్టేట్​  వైస్ చైర్మన్ రాముడు  ఆధ్వర్యంలో సభ్యులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *