5 రోజుల పనిదినాలు అందరికీ సమానంగా అమలు చేయాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: యూఎఫ్బియూ పిలుపు మేరకు 11 న కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కర్నూలు కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ర్యాలీ మరియు ధర్నా చేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది.5 రోజుల పనిదినాలు ముఖ్య డిమాండ్ గా మరియు పిఎల్ఐ ను అందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ తో సమ్మె చేయడం జరిగింది. సరైన స్పందన రాకపోతే ఈ నెల 28, 29, 30 తేదీలలో మూడు రోజుల సమ్మెకు నోటీసు ఇవ్వడం జరిగింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని బ్యాంక్ యూనియన్స్ నాయకులు తెలిపారు. ఈ సమ్మెలో కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఏపీ స్టేట్ వైస్ చైర్మన్ రాముడు ఆధ్వర్యంలో సభ్యులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది.


