బ్యాంకింగ్‌లో 5 రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయాలి
1 min read
ఉద్యోగుల మధ్య అసమానతలు సృష్టించే పిఎల్ఐ స్కీంకు బదులుగా మెరుగైన, న్యాయమైన పిఎల్ఐ విధానం తీసుకురావాలి: యూఎఫ్‌బీయూ
కర్నూలు, న్యూస్ నేడు : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కర్నూలులో బ్యాంక్ ఆఫ్ బరోడా, కేఈ ప్లాజా వద్ద భారీ సమ్మె కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కన్వీనర్ కా. ఇ. నాగరాజు నాయకత్వం వహించారు.ముందుగా కర్నూలు నగరం మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా రాజవిహార్, మౌర్య ఇన్, 5 రోడ్స్ జంక్షన్, రాజ్ థియేటర్ మీదుగా కేఈ ప్లాజా వద్దకు చేరుకుని సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా UFBU నాయకులు మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత వేతన ఒప్పందంలో బ్యాంకుల యాజమాన్య సంస్థ IBA ఐదు రోజుల బ్యాంకింగ్‌కు అంగీకరించి, ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకు పైగా కాలం గడిచినప్పటికీ, ఇప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు.ఇదే డిమాండ్‌పై ఈ ఏడాది జనవరి 27న బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించినప్పటికీ, బ్యాంకు యాజమాన్యాల నుంచి సరైన స్పందన రాలేదని నాయకులు తెలిపారు.అదేవిధంగా 12వ వేతన ఒప్పందంలో ఇంకా పరిష్కారం కాని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో AIBEA నాయకులు కా. శివకృష్ణ, కా. Anil Reddy,AIBOC నాయకులు కా. రాజు, మురళి కృష్ణ ,కా. పుష్పక్ కుమార్; NCBE నాయకులు కా. విద్యాసాగర్, కా. శ్రీకాంత్; APGB నాయకులు కా. హనుమంత, ఐబో నాయకులు మంజునాథ్, విజయ్, హనుమంత రెడ్డి, కా. రాఘవేంద్ర, AITUC నాయకులు మునెప్ప, CITU నాయకులు రాధాకృష్ణ, మెడికల్ రేప్ యూనియన్ నాయకులు ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.వివిధ బ్యాంకు యూనియన్ల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నిరసన వ్యక్తం చేశారు.



