NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: కేంద్ర మాజీ మంత్రివర్యులు, డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను ప్యాపిలి పట్టణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్‌లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లక్కసగరం లక్ష్మీ రెడ్డి, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, బత్తుల రామేష్ రెడ్డి, అంకిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మండల కన్వీనర్ సుదర్శన్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, టీడీపీ జనరల్ సెక్రటరీ నడిగడ్డ నాగేంద్ర, టీడీపీ ఎస్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి మధుకుమార్, ఆర్.ఓ. నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు, బీజేపీ జిల్లా నాయకులు కె.సి. మద్దిలేటి, చల్లా వీర, రాపురం నాగేశ్వరరావు, నల్లమేకలపల్లె సత్యం, రాజశేఖర్, పిక్కిలి బోలికొండ, కాంతారావు, బ్యాంక్ శీను, వెంకట్, పుల్లయ్య, సుంకన్న మరియు ప్యాపిలి మండల నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు మరియు ప్రజల తరఫున ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *