తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ కాలువలో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం
1 min read
మృతదేహం ఆనవాళ్ల ఆధారంగా గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నం
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం వుండవాగిలి గ్రామ సమీపంలోని తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ కాలువలో శనివారం గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి వయసు సుమారు 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు తెల్లని కట్ బనియన్, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, వ్యక్తి మృతి చెంది సుమారు నాలుగు నుంచి ఐదు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. తమ పరిధిలో ఎవరైనా వ్యక్తులు కనిపించకుండా పోయినట్లయితే, లేదా పై ఆనవాళ్లతో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే హొళగుంద పోలీసులను సంప్రదించాలని సూచించారు.
సమాచారం కోసం:హొళగుంద ఎస్‌ఐ: 9121101161, ఆలూరు సర్కిల్ సీఐ: 9121101157



