NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరువు కాటుతో రైతన్న విలవిలలాడుతుంటే పట్టించుకోని కూటమి ప్రభుత్వం

1 min read

15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావం

ఖరీఫ్ ముగుస్తున్నా 5 శాతం పంటలు కూడా సాగుకాని దుస్థితి

పంట లేదు.. పశుగ్రాసం లేదు.. దిక్కుతోచని స్థితిలో పాడిరైతన్న

అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

రైతన్నకు ప్రతి ఎకరాకు రూ.15–20 వేల పరిహారం చెల్లించాలి

మామిడి, చీనీ తోటలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లా  ( న్యూస్ నేడు ప్రతినిధి) : అన్నమయ్య జిల్లాను కరువు కమ్మేసిందని, గత 10–15 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యాలయంలో  జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎంఎల్ఏ ఆకేపాటి అమర నాధ రెడ్డి తో కలసి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ   సెప్టెంబర్ మాసం పూర్తవుతోందని, అంటే దాదాపుగా ఖరీఫ్ పూర్తి అయిపోతోందని, 5% కూడా పంటలు  సాగు చేయలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అన్నమయ్య జిల్లాలో  ఎక్కువగా లోటు వర్షపాతం నమోదయిందన్నారు.పంట వేసుకోవడం, ఆ వేసిన పంట కూడా కళ్ల ముందే ఎండిపోతుండడం, ఒక కన్న బిడ్డలా సాకుతున్నటువంటి మామిడి చెట్లు గాని, చీనీ చెట్లు గాని, మిగిలినటువంటి ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి అన్ని చెట్లు కూడా ఎండిపోతుంటే రైతుల బాధ వర్ణనాతీతమన్నారు.

పశుగ్రాసం కరవు.. అప్పులు చేసి పశువుల పోషణ

  పాడి పరిశ్రమకు సంబంధించి గడ్డి కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదన్నారు. ఈరోజు ట్రాక్టర్లలో గడ్డి కొనాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. వాటికి కూడా వెనకాడకుండా, అప్పులు చేసి, ఉన్న పశువులను కాపాడుకోవడం కోసం వాళ్లు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే చాలా బాధాకరమన్నారు.మరొక పక్కేమో పాల ధర లేదని, గతంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. మామిడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైపోయిందని, అసలు అమ్ముకోలేక రోడ్డు మీద గతంలో వేయడం  మనం చూస్తున్నామన్నారు. ఈరోజు కళ్లముందే మామిడి తదితర చెట్లు ఎండిపోతుంటే ఆ చెట్లన్నీ కొట్టేసి.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మైనా రిటీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మాదిరెడ్డి సత్య నారాయణ రెడ్డి, అన్నా సలీం,  మాజీ సర్పంచ్ గోపిరెడ్డి,మోక్షిత్, సోషియల్ మీడియా జిల్లా అధ్యక్షుడు  నరేష్ స్వామీ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *