పశ్చిమగోదావరి జిల్లాలోని షెడ్యూల్డు కులముల నిరుద్యోగ యువతకు శిక్షణా కోర్సులు
1 min read
శిక్షణా కోర్సులు వివిధ జిల్లాలలో అందించుటకు చర్యలు
ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార సంఘం లిమిటెడ్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల సహకార ఆర్ధిక సంస్థ తాడేపల్లి వారి ఆదేశములు ననుసరించి, 12వ తరగతి నుండి డిగ్రీ (Science) లేదా B.Tech పూర్తి అయిన వారికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని షెడ్యూల్డు కులముల నిరుద్యోగ యువతకు ఈ క్రింద తెలిపిన శిక్షణా కోర్సులు వివిధ జిల్లాలలో అందించుటకు చర్యలు తీసుకోనబడుచున్నవని శనివారం ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి ఒక ప్రకటనలో తెలిపారు.
(1 ). అసిస్టెంటు టేక్నిషియన్ (కంప్యూటరు మరియు పెరిఫెరల్) – 12 వ తరగతి పాస్ – ఏలూరు.
(2 ). కిసాన్ డ్రోన్ ఆపరేటరు – 12 వ తరగతి పాస్ – అనంతపురం.
(3 ). ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్సు టెక్నీషియన్ – 12 వ తరగతి పాస్ – కాకినాడ.
( 4 ). ఎలక్ట్రీషియన్ – స్మార్ట్ ఎనర్జీ అండ్ IOT Enabled Systems – 12 వ తరగతి పాస్ – శ్రీకాకుళం.
( 5 ).సోలార్ PV Installer (సుర్యమిత్రా) – 12 వ తరగతి పాస్ (సైన్సు) – కడప. (6 ). ల్యాబ్ టేక్నిషియన్– Pharma, Biologics and Medical Devices -12 వ తరగతి పాస్ – విశాఖపట్నం.( 7). A I డేటా ఇంజనీరింగు ఎనలిస్ట్ – Degree (Science లేదా B.Tech) – విజయవాడ.( 8 ). జూనియర్ సాఫ్ట్వేర్ డవలపర్ – Degree (Science లేదా B.Tech) – ఒంగోలు.
పై తెలిపిన విధముగా వివిధ జిల్లాలు యందు వివిధ శిక్షణలు అందించుటకు నిర్ణయించినారు. పై కోర్సులలో శిక్షణ పొందగోరు అభ్యర్డులకు ఉచిత బోజన వసతి (Free food & accomidation) కల్పించబడును మరియు పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా వసతి కల్పించబడును. పై తెలిపిన కోర్సులలో శిక్షణ పొందుటకు పైన తెలిపిన అర్హత కలిగిన అభ్యర్ధులు https://apsccorporation.ap.gov.in/training/skill-program వెబ్ పోర్టల్ నందు ది.30-09- 2026 లోపుగా నమోదు చేసుకొనుటకు అవకాశము కల్పించడమైనది. పై పేర్కొనిన విషయముపై సందేహములున్నచో పూర్తి వివరముల కొరకు యస్.సి. కార్పొరేషన్, ఏలూరు కార్యాలయమును నేరుగా గాని లేదా ఈ కార్యాలయపు సిబ్బంది K.Suguna Rao – 97013 55337, P.Ramanjaneya Prasad – 97058 63666, A.Ravi Kumar – 9393527666 & P.Pradeep Kumar – 96402 94967 ద్వారా గాని సంప్రదించ వలసినదిగా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి ఆ ప్రకటనలో తెలిపారు.


