NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కేంద్రంలో సైనిక సంక్షేమ కార్యాలయం, ఈసిహెచ్ఎస్ హాస్పిటల్, క్యాంటీన్ ఏర్పాటు చేయాలి

1 min read

– మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి 

– డిఫెన్స్ వెటర్న్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్య క్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో  డిఫెన్స్ వెటర్న్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు విలేకరు ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన మాట్లాడుతూ మదనపల్లెకి జిల్లా పరిషత్ కార్యాల యం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పడం చాలా సంతోషం అన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 2023లోఅల్లూరు జిల్లాలో   పని చేసిన సమ యం లో కలెక్టర్ కు  రాష్ట్రపతి అవార్డు రావడం జరిగిందని,  అన్నమయ్య జిల్లా ఏర్పటై మూడు సంవత్సరాలు అవు తోందని మదనపల్లె ను జిల్లా  కేంద్రంగా మార్చి  ఏడాది అవుతున్న అన్నమయ్య జిల్లాలో మాజీ సైనికులకు జిల్లా సైనిక సంక్షేమ కార్యా లయం, ఈసిహెచ్ఎస్ హాస్పిటల్, సి ఎస్ డి క్యాంటీన్ ఏర్పాటు చేయ వలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ పై ఉందని గుర్తు చేశారు. ఇందుకు మదనపల్లె లో చాలా భవనాలు ఖాళీగా ఉన్నా యిని కావున కలెక్టర్ చొరవ చూపి కార్యాలయం  ఏర్పాటు చేయాలని కోరారు. పీలేరు, రాయ చోటి, మదనపల్లె లో దాదాపు 2వేల మంది మాజీ సైనికులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నా యిని అయితే మాజీ సైనికులకు ప్రభుత్వ పథకాలలో ఎక్కడ చోటు లేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూరల్, అర్బన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రక టించిందని, మాజీ సైనికులకు ఇంటి స్థలాలు కోసం ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి  దరఖాస్తూ చేసుకొనే  అవకాశం ఇవ్వాలని కోరారు. దేశం కోసం సేవ చేస్తున్న సైనికుల పైన, వారి కుటుంబ సభ్యుల పై దాడులు జరుగుతున్నా యిని దీనిపై ప్రజలు, రెవెన్యూ, పోలీసు అధికారులు సైనికుల పై జాలి చూపాలని అభ్యర్థించారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,  ఐటీ శాఖ మంత్రి లోకేష్  మాజీ సైనికుల సమస్య లను ఆలకించాలని వేడు కున్నారు. ఈ కార్యక్రమం లో మదనపల్లె మాజీ సైనికుల సంఘం వైస్ ప్రెసిడెంట్ వెంకట రమణారెడ్డి, సుబేదార్ నూరు మొహమ్మద్, సెక్రెటరీ సుబ్బ రాయుడు, హవల్దార్ ప్రకాష్ నాయుడు, నాయక్, చంద్రశేఖర్ రెడ్డి లుపాల్గొన్నారు.

About Author